AjithKumar: 25 ఏళ్ళ తర్వాత తిరిగి తెరపై కనిపించబోతున్న బ్యూటిఫుల్ జంట..
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భాషా పరంగా ఎలాంటి పరిమితులు లేకుండా, ఆయనకు అన్ని చిత్ర పరిశ్రమల్లో మంచి మార్కెట్ ఉంది.
అజిత్ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పిన చిత్రాల్లో 'వాలి' ఒకటి. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
దర్శకుడు ఎస్.జె. సూర్య రూపొందించిన ఈ చిత్రంలో సిమ్రాన్ కథానాయికగా నటించగా, అజిత్ ద్విపాత్రాభినయం చేసి, ఒక పాత్రలో నెగటివ్ షేడ్, మరొకటిలో పాజిటివ్ షేడ్‌ను ఒడిసి పట్టి అద్భుతంగా నటించారు.
సిమ్రాన్ కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికీ సంగీతప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
వివరాలు
'గుడ్ బ్యాడ్ అగ్లీ'చిత్రంలో ప్రత్యేక పాత్రలో సిమ్రాన్
ప్రస్తుతం అజిత్ వరుసగా సినిమాలు చేస్తుండగా, సిమ్రాన్ మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం,ఈ జంట సరిగ్గా 25 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు.
ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో,మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న'గుడ్ బ్యాడ్ అగ్లీ'చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ సమాచారం దాదాపు ఖరారైనట్టే.
ముఖ్యంగా అజిత్ వీరాభిమాని అయిన ఆధిక్,'వాలి'చిత్రాన్ని తనకు ఎంతో ఇష్టమైనదిగా భావిస్తారని చెబుతున్నారు.
అందుకే,ఆ కాంబినేషన్‌ను మరోసారి తెరపై చూపించేందుకు ఒక ప్రత్యేక ఎపిసోడ్‌ను రూపొందించినట్లు సమాచారం.
ఇక,సిమ్రాన్ అజిత్‌తో కలిసి ఏ రకమైన సన్నివేశాల్లో కనిపిస్తారో చూడాలి!