
Janhvi Kapoor : భూమ్మీద ఉగ్రవాదులకు స్థానం లేదు.. జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్-భారత్ యుద్ధ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కూడా సైనికులకు మద్దతుగా నిలుస్తున్నారు.
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇప్పటికే వరుసగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆర్మీకి మద్దతు తెలియజేస్తూ వస్తోంది. తాజాగా యుద్ధం నేపథ్యంలో ఆమె ఓ భావోద్వేగంతో కూడిన సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేసింది.
ఇన్ని రోజులు మనం యుద్ధం జరగకూడదని ఆకాంక్షించాం. కానీ టెర్రరిస్టులు మన ప్రజల్ని బలిగొడుతుంటే మౌనంగా ఉండలేం.
Details
దేశం మొత్తం ఆర్మీకి అండగా నిలవాలి
ఎన్నో దశాబ్దాలుగా మనపై జరిగే దాడులకు ఇప్పుడో సమాధానం అవసరం. ఇండియన్ ఆర్మీ ఇప్పుడు చేస్తోంది. దశాబ్దాలుగా నిగ్రహించిన బాధకు ఇది ప్రతిస్పందన అని జాన్వీ పేర్కొంది.
టెర్రరిస్టులు భూమ్మీద ఉండటానికి అర్హులు కాదు. మన సైనికులు బార్డర్‌పై మనకోసం పోరాడుతున్నారు. వాళ్ల వల్లే మనం సురక్షితంగా ఉన్నాం. వాళ్ల కోసం మనం ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉండాలి.
ఈ సమయంలో దేశం మొత్తం ఆర్మీకి అండగా నిలవాలి. ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయొద్దని జాన్వీ స్పష్టం చేసింది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశానికి అండగా నిలుస్తున్న భారత సైన్యానికి సెలబ్రిటీల మద్దతు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.