
Suriya64 : వెంకీ అట్లూరి-సూర్య కాంబో మూవీకి ఖరారైన టైటిల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లుగా ఆయన నుంచి స్ట్రయిట్ తెలుగు సినిమా రాలేదు. ఈ గ్యాప్ తర్వాత సూర్య ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తుండటం అభిమానులకు సంతోషకర విషయంగా మారింది. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవల సూర్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Details
ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మూవీ
ముఖ్యంగా సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈసినిమాకు యూనిట్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు 'విశ్వనాధం అండ్ సన్స్' అనే టైటిల్‌ను ఖరారు చేశారట. కథకు తగ్గట్టు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. యూనిట్ వర్గాల ప్రకారం 'విశ్వనాధం అండ్ సన్స్' వెంకీ అట్లూరి కెరీర్‌లో బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉండగా,మలయాళ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం జీ.వి. ప్రకాష్ అందిస్తున్నారు.