
this week movies: ఈ వారం థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారంలాగే బాక్సాఫీస్ వద్ద ఈసారి వినోదాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటిటిలో కూడా పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటిటిలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి.
వివరాలు
కూలీ సినిమా
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కూలీ'. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో,దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన టీజర్,ట్రైలర్‌లు ఆ అంచనాలను మరింతగా పెంచాయి. ముఖ్యంగా తెలుగు స్టార్ హీరో నాగార్జున ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఉపేంద్ర,శ్రుతి హాసన్,సౌబిన్ షాహిర్,సత్యరాజ్‌లతో పాటు, ఆమిర్ ఖాన్ చేసే పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రచార చిత్రాలు, పోస్టర్‌లు ఎంతగానో ఆసక్తి పెంచినా, లోకేష్ ఎంచుకున్న అసలు కథ ఏమిటో ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాలేదు.
వివరాలు
వార్ 2 సినిమా
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అడ్వాణీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ,తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఇంతకుముందు వచ్చిన చిత్రాలకు ఇది సీక్వెల్‌గా రానుంది. ఒకప్పుడు దేశానికి సేవ చేసిన ఇండియన్ ఏజెంట్ కబీర్ ఎందుకు దేశద్రోహిగా మారాడు?అతడిని పట్టుకోవడానికి ఏజెంట్ విక్రమ్(ఎన్టీఆర్) ఏ కారణం చేత రంగంలోకి దిగాడు? ఈ ఇద్దరి మధ్య ఏ విధమైన ఘర్షణ చోటు చేసుకుంది?.. ఇదే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశమని బాలీవుడ్ వర్గాల సమాచారం.
వివరాలు
ఓటీటీలో కొత్త ఎంటర్టైన్మెంట్
విడుదలైన ప్రచార వీడియోలు చూస్తే, పూర్వం వచ్చిన స్పై యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో యాక్షన్ సన్నివేశాలను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ముందుకు వస్తోంది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది.
వివరాలు
ఓటీటీలో కొత్త ఎంటర్టైన్మెంట్
అమెజాన్ ప్రైమ్ అంధేరా (హిందీ సిరీస్) ఆగస్టు 14 జియో హాట్‌స్టార్ సారే జహాసే అచ్చా (హిందీ మూవీ) ఆగస్టు 13 జీ5 టెహ్రాన్ (హిందీ చిత్రం)ఆగస్టు 14 జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (మలయాళం) ఆగస్టు 15 సోనీలివ్ కోర్ట్ కచేరీ (హిందీ సిరీస్) ఆగస్టు 13 బుక్ మై షో సర్ (హిందీ సిరీస్) ఆగస్టు 11