Page Loader
Game Changer:'గేమ్‌ ఛేంజర్‌' లీక్ బెదిరింపులు.. విచారణ ప్రారంభంభించిన సైబర్‌ పోలీసులు 
'గేమ్‌ ఛేంజర్‌' లీక్ బెదిరింపులు.. విచారణ ప్రారంభంభించిన సైబర్‌ పోలీసులు

Game Changer:'గేమ్‌ ఛేంజర్‌' లీక్ బెదిరింపులు.. విచారణ ప్రారంభంభించిన సైబర్‌ పోలీసులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

'గేమ్‌ ఛేంజర్‌' సినిమా విడుదలకు ముందు, సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను లీక్‌ చేస్తామని బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మూవీ విడుదలకు ముందు, సినిమా నిర్మాతలు, టీమ్‌ సభ్యులను సోషల్‌ మీడియా వేదికగా డబ్బు ఇవ్వాలని బెదిరించారు. డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాను లీక్‌ చేస్తామని వారు బెదిరించారు. అడిగిన మొత్తం ఇవ్వనందుకు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు విడుదలకు రెండు రోజులు ముందే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Details

45 మందిపై ఫిర్యాదు

అలాగే సినిమా రిలీజ్‌ అయిన రోజున ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. ఈ ఆధారాలతో చిత్ర బృందం, 45 మందితో కూడిన ముఠాపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ ముఠా వెనుక ఉన్న వారిని కనుగొనడానికి విచారణ చేస్తున్నారు. అలాగే సోషల్‌ మీడియా ద్వారా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న ఖాతాలపై కూడా 'గేమ్‌ ఛేంజర్‌' చిత్ర బృందం కంప్లైంట్‌ ఇచ్చింది. రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా, సంక్రాంతి కానుకగా 10న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి స్పందన పొందింది.