LOADING...
'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్ 
ఆగస్టు 17నుండి టైగర్ దండయాత్ర మొదలవుతుందని చిత్రబృందం అప్డేట్

'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 12, 2023
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవితేజ కెరీర్‌లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు. నుపుర్ సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. టైగర్ నాగేశ్వర్ రావు దండయాత్ర ఆగస్టు 17నుంచి మొదలుకానుందని చిత్రబృందం వెల్లడి చేసింది. ఇప్పటివరకు టైగర్ నాగేశ్వర్ రావు సినిమా నుంచి గ్లింప్స్ మాత్రమే రిలీజైంది. దాంతో ఆగస్టు 17న కీలక అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన థియేటర్లలో విడుదల అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టైగర్ నాగేశ్వర్ రావు సినిమా అప్డేట్ పై నిర్మాణ సంస్థ ట్వీట్