బాలీవుడ్ ను పొగుడుతూ దక్షిణాది సినిమాపై విరుచుకుపడ్డ హీరోయిన్ తాప్సీ
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ తాప్సీ కనిపించలేదు. చివరగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు తెరమీద మెరిసిన తాప్సీ, ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంటోంది.
అయితే బాలీవుడ్ కు వెళ్ళిపోయినప్పటి నుండి దక్షిణాది సినిమాపై ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటుంది తాప్సీ. తాజాగా వివాదాస్పద కామెంట్లతో మరోమారు చర్చల్లో నిలిచింది.
దక్షిణాది సినిమాల్లో తనకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పుకొచ్చింది తాప్సీ. చాలా సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాల ద్వారా సరైన గుర్తింపు దక్కలేదని అంది.
బాలీవుడ్ లో మాత్రం పింక్ సినిమా ద్వారా తన కెరీర్ పూర్తిగా మలుపు తిరిగిందని, నటనకు ప్రాధాన్యం ఉన్న అవకాశాలు వరుసగా వచ్చాయని చెప్పుకొచ్చింది.
Details
తాప్సీ ఇలా, కాజల్ అలా
తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. దక్షిణాది సినిమాలు చేయడం వల్లే బాలీవుడ్ లో అవకాశం వచ్చిందని, ఆ విషయం తాప్సి గుర్తుంచుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గతంలోనూ ఇలాంటి కామెంట్సే చేసింది తాప్సీ. ఇక్కడి దర్శకులు, హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్ గా మాత్రమే చూపించడానికి ఇష్టపడతారని పరోక్షంగా ఒకానొక డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడింది.
దక్షిణాది సినిమాపై తాప్సీ నెగటివ్ గా మాట్లాడుతుంటే కాజల్ అగర్వాల్ మాత్రం సౌత్ ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది.
సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ, విలువలు ఎక్కువగా ఉంటాయని, ఇవన్నీ బాలీవుడ్లో లోపించాయని కాజల్ అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.