Page Loader
Tripti Dimri : యానిమల్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..ఎన్టీఆర్‌'తో నటించాలని ఉందంటున్న త్రిప్తి డిమ్రీ
ఎన్టీఆర్‌'తో నటించాలని ఉందంటున్న త్రిప్తి డిమ్రీ

Tripti Dimri : యానిమల్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..ఎన్టీఆర్‌'తో నటించాలని ఉందంటున్న త్రిప్తి డిమ్రీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 13, 2023
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్'లో యానిమల్‌ సినిమాతో పాటు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు 'త్రిప్తి డిమ్రీ' (Tripti Dimri). డైరెక్టర్ సందీప్‌ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సూపర్‌ హిట్‌ విజయం అందుకుంది. జోయా పాత్రలో త్రిప్తి డిమ్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా IMDB (ఇండియన్‌ మూవీ డేటాబేస్‌) విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్ల జాబితాలో త్రిప్తి అనూహ్యంగా తొలిస్థానంలో నిలిచింది. మరోవైపు తాను పలు సౌత్‌ సినిమాల్లో ఎంపికయ్యానంటూ వస్తోన్న వార్తలపై ఆమె స్పందించారు. తాను ఇప్పటి వరకు ఏ దక్షిణాది సినిమాకు సంతకం చేయలేదన్నారు, దక్షిణాదిలో అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని, ఈ మేరకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉందన్నారు.

details

సోషల్‌ మీడియాలోనూ అమాతంగా ఫాలోయింగ్‌ పెంచుకున్న త్రిఫ్తి డిమ్రీ

ఇదే సమయంలో యానిమల్ సినిమా విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. తన నటనకు గానూ ప్రశంసలు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ఉబ్బితబ్బిపోయారు. ఇదే సమయంలో యానిమల్ సినిమా తర్వాత త్రిప్తికు సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్‌ అమాతంగా పెరిగిపోయింది. 'యానిమల్‌'కు ముందు ఆమె ఫాలోవర్స్‌ ఆరు లక్షల మంది కాగా ఈ చిత్రం తర్వాత ఆ సంఖ్య 36 లక్షలకు ఎగబాకింది. ఇక ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ (Prashant Neel) కాంబోలో రానున్న సినిమాలో త్రిప్తిని తీసుకోవాలంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. యానిమల్ సినిమా ఫలితంతో నేషనల్‌క్రష్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ తర్వాత చేయనున్న సినిమాలపై ప్రేక్షకుల్లో, తోటి సెలబ్రిటిల్లోనూ ఆసక్తి నెలకొంది.