
Trisha- Chiranjeevi: త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ చిరంజీవి
ఈ వార్తాకథనం ఏంటి
వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నటి త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'విశ్వంభర'.
దాదాపు 18 సంవత్సరాల తర్వాత చిరంజీవి, త్రిష ఈ సినిమాలో నటిస్తున్నారు.
అయితే త్రిష ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొన్నది.
ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి తనకు పంపిన ప్రత్యేక బహుమతిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఉష్ణోగ్రతను నియంత్రించే స్మార్ట్ మగ్‌ను త్రిషకు చిరంజీవి బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్‌కు కృతజ్ఞతలు చెబుతూ..ఇన్‌స్టా స్టోరీలో త్రిష రాసుకొచ్చింది.
ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
త్రిషకు స్మార్ట్ మగ్‌ను పంపిన చిరంజీవి
Trisha is overjoyed by Chiranjeevi's special gift - Deets insidehttps://t.co/CczL89TDCD#MegaStarChiranjeeevi #Trisha #Vishwambhara #123telugu
— 123telugu (@123telugu) March 10, 2024