Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించి ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ తరచూ వినిపిస్తుంటుంది. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఒక బ్యానర్‌లో కలిసి పనిచేసే వ్యక్తుల మధ్య మంచి అనుబంధం ఏర్పడితే.. అదే బంధం కొనసాగుతుందని, దానికి ప్రత్యేకంగా ఎలాంటి అగ్రిమెంట్లు అవసరం లేదని ఆయన తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల కాంపౌండ్స్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
వివరాలు
సినిమాలపై అభిమానం..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. తన బాబాయి చిన్నబాబు ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్న సమయంలో తొలి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని భావించారని చెప్పారు.
త్రివిక్రమ్ పనితీరు, సినిమాలపై ఆయనకు ఉన్న అభిమానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
'జులాయి' సినిమా ప్రారంభమైనప్పటి నుంచి త్రివిక్రమ్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం మరింత బలపడిందని నాగవంశీ పేర్కొన్నారు.
వివరాలు
ఇద్దరం ఒకే ఫ్యామిలీ..
'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' అనే బ్యానర్ పేరును కూడా త్రివిక్రమే సూచించారని నాగవంశీ వెల్లడించారు.
అంతేకాదు.. ఆ బ్యానర్ లోగోను కూడా ఆయనే డిజైన్ చేశారని చెప్పారు.
"అప్పటి నుంచి ఇప్పటివరకు త్రివిక్రమ్ బయట బ్యానర్‌లో సినిమా చేయలేదు.
దీనికి ఎలాంటి అగ్రిమెంట్లు లేవు. మా మధ్య ఉన్న రిలేషన్‌షిప్ అలాంటిది. ఒక ఫ్యామిలీలా అయిపోయాం" అని నాగవంశీ అన్నారు.