NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / AA22: త్రివిక్రమ్‌-బన్నీ AA22 ప్రాజెక్టు వివరాలివే..!
    తదుపరి వార్తా కథనం
    AA22: త్రివిక్రమ్‌-బన్నీ AA22 ప్రాజెక్టు వివరాలివే..!
    త్రివిక్రమ్‌-బన్నీ AA22 ప్రాజెక్టు వివరాలివే..!

    AA22: త్రివిక్రమ్‌-బన్నీ AA22 ప్రాజెక్టు వివరాలివే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 27, 2025
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఒకటైన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)-అల్లు అర్జున్ (Allu Arjun) జోడీ గురించి మరోసారి చర్చ మొదలైంది.

    ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.

    ఇప్పుడు ఈ ఇద్దరూ AA22 ప్రాజెక్ట్‌తో మళ్లీ కలసి పని చేయనున్నారని తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

    శివపార్వతుల పుత్రుడు కార్తికేయ (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని, ఇది సోషియో మైథలాజికల్ ఫాంటసీ కాన్సెప్ట్‌లో ఉంటుందని సమాచారం.

    ఈ కథలో తండ్రీకొడుకుల (శివుడు-కార్తికేయ) పునః కలయికను చూపించనున్నారట.

    వివరాలు 

    త్వరలో AA22 ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో 

    ఈ వార్తలు నిజమైతే, మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్‌ మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    ఈ సినిమాకు 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. దీనిని భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

    AA22 ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

    ఇటీవల పుష్ప 2: ది రూల్ సినిమాతో బాక్సాఫీస్‌ను దుమ్ములేపిన బన్నీ, మరో వైపు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్, ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందే సినిమా ద్వారా కొత్త ట్రెండ్ సెట్ చేయనున్నారని అంచనా.

    AA22 సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    త్రివిక్రమ్ శ్రీనివాస్

    తాజా

    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్

    అల్లు అర్జున్

    Allu Arjun: త్రివిక్రమ్-అల్లు అర్జున్ కొత్త సినిమా.. మార్చిలో షూటింగ్ ప్రారంభం? త్రివిక్రమ్ శ్రీనివాస్
    Allu Arjun: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‏కు తరలింపు సినిమా
    Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష సినిమా
    Allu Arjun: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌  సినిమా

    త్రివిక్రమ్ శ్రీనివాస్

    మహేష్ తో సినిమాపై శ్రీలీల మౌనం... కారణం అదేనా? టాలీవుడ్
    SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే మహేష్ బాబు
    గుంటూరు కారం నుండి మరో పోస్టర్: చొక్కా బటన్లు విప్పేసిన సూపర్ స్టార్  గుంటూరు కారం
    Allu Arjun: రెండు భాగాలుగా అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ.. క్లారిటీ ఇదే!  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025