Page Loader
Sreeleela: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేతో శ్రీలీల.. ప్రోమో కోసం అభిమానుల ఎదురుచూపులు! 
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేతో శ్రీలీల.. ప్రోమో కోసం అభిమానుల ఎదురుచూపులు!

Sreeleela: అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకేతో శ్రీలీల.. ప్రోమో కోసం అభిమానుల ఎదురుచూపులు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 26, 2024
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' కొత్త సీజన్‌ దుమ్ములేపుతోంది. బాలయ్య తన హోస్టింగ్ స్టైల్‌తో టీవీ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌తో చేసిన ఎపిసోడ్ భారీ సక్సెస్ అయింది. ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా, బాలకృష్ణ షోలో మరో గెస్ట్‌గా యువకుల హృదయాలను గెలుచుకున్న శ్రీలీల చేరారు. భగవంత్ కేసరి సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది.

Details

తర్వాతి ఎపిసోడ్ లో నవీన్ పొలిశెట్టి?

చీరకట్టులో క్యూట్ లుక్స్‌తో క్యారవాన్ ముందు శ్రీలీల దిగుతున్న స్టిల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా, ప్రోమో విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు. ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శ్రీలీల తర్వాత నవీన్ పొలిశెట్టి ఈ షోలో కనిపించనున్నట్లు టాక్.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీలీల ఫోటోలు వైరల్