
SS Rajamouli: మహేశ్ బాబు సినిమాపై అప్‌డేట్ అడిగితే.. కర్ర పట్టుకొని బెదిరించిన రాజమౌళి
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాజమౌళి 'RRR'తో గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యాక, మహేశ్‌తో రూపొందించే సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో తీయాలని భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే మత్తువదలరా 2 ప్రమోషన్లలో ఈ చిత్రంపై ఆసక్తికర ఘటన జరిగింది.
'మత్తువదలరా 2' ప్రమోషన్‌లో భాగంగా శ్రీసింహ, కాలభైరవలు రాజమౌళి ఇంటికి వెళ్తారు.
2019లో విడుదలై విజయవంతమైన 'మత్తువదలరా'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నారు.
Details
సెప్టెంబర్ 13న 'మత్తువదలరా 2' రిలీజ్
సినిమా ప్రమోషన్ గురించి చర్చిస్తుండగా, కార్తికేయ మరియు శ్రీసింహ మధ్య 'బాహుబలి 2' ప్రమోషన్స్ గురించి సరదాగా వాగ్వాదం జరుగుతుంది.
ఇక రాజమౌళి వచ్చి, ''ఈ గోల ఏంటి? పని చేసుకోవాల్సింది పోయి ఇక్కడ సౌండ్ పెడుతున్నారా?'' అంటూ కోపంగా మాట్లాడుతారు.
ఇక చివర్లో మహేష్ బాబు సినిమాపై అప్‌డేట్ అడగ్గా, రాజమౌళి పెద్ద కర్ర తీసుకుని వారిని వారిని బెదిరించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ సరదా ప్రమోషనల్ భాగంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'మత్తువదలరా 2' సెప్టెంబర్ 13న విడుదల కానుండగా, ఇందులో శ్రీసింహ, సత్య, ఫారియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించారు.