Loading...
Ustaad Bhagat Singh: మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ ఫిదా
మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ ఫిదా

Ustaad Bhagat Singh: మాస్ డైలాగులు, హై వోల్టేజ్ యాక్షన్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ ఫిదా

వ్రాసిన వారు Moogati Shabari
Mar 19, 2026
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వం వహించగా, ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు. అదేవిధంగా కోలీవుడ్‌ నటుడు, దర్శకుడు పార్తీబన్ విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను తమన్ అందించారు.

వివరాలు

సినిమా ఎలా ఉందంటే..

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 4 గంటల నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి ప్రదర్శనలు మొదలయ్యాయి.

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి? పవన్ సినిమా ఎలాంటి టాక్ సంపాదించింది? అనే విషయాలను ట్విట్టర్ స్పందనల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

డైలాగ్స్ అదుర్స్..మ్యూజిక్ హైలెట్

సినిమా చూసిన ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

పవన్ సినిమా అద్భుతంగా ఉందని, అసలు ఇలాంటి అనుభవం ఊహించలేమని అన్నారు.

హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్‌ను కొత్తగా చూపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

తమన్ ఇచ్చిన సంగీతం ఎంతో బాగుందన్నారు.

మరో నెటిజన్ చెబుతూ..ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ అని అన్నారు.

పవర్ స్టార్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడని, సినిమా మొత్తం ఒక స్థాయిలో సాగిందన్నారు.

ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సన్నివేశాలు అత్యంత హై స్థాయిలో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

తమన్ సంగీతం ఆకట్టుకుందని, మాస్ డైలాగులు చాలా బాగున్నాయని అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT