
Ustad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు.. స్పష్టం చేసిన మూవీ టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ వింటే పూనకాలు రావాల్సిందే.
పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయితే, థియేటర్ల వద్ద అభిమానులు చూపించే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గత కొన్నేళ్లుగా పవన్ రాజకీయ బాధ్యతల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. దాంతో అభిమానులు ఆయన సినిమాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
Details
ఫ్యాన్స్ కోసమే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రత్యేక చిత్రం
తమిళ హీరో నటించిన 'తేరి' సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ రిమేక్ అనే చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తలపై ప్రస్తుతం క్లారిటీ వచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదని, సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఫుల్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఆయన చెప్పారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు.
పవన్ మునుపటి సినిమాల్లో ఉండే ఆటిట్యూడ్, పంచ్‌లు మళ్లీ మిస్సవకుండానే ఈ సినిమాలో కనిపిస్తాయని, ఇది నిజంగా ఫ్యాన్స్ కోసం ఒక ప్రత్యేక చిత్రమని" దశరధ్ అన్నారు.