Citadel : వరుణ్ ధావన్-సమంత 'సిటాడెల్' స్ట్రీమింగ్ డేట్ ఇదే
'సిటాడెల్' వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి కాగా, పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నారు. ఈ మూవీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం శుభవార్త అందింది. ప్రముఖ ఓటిటి ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు రాజ్ అండ్ డీకే వెల్లడించారు.
ప్రత్యేక శిక్షణ తీసుకున్న సమంత
హిందీతో పాటు భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక 'ఫ్యామిలీ మ్యాన్-2' లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సమంత 'సిటాడెట్' కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుందని తెలిసింది. సిమ్రాన్, కేకే మేనన్, సోహమ్ మజుందార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ లో సమంత ఎలాంటి డూప్‌లు లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం.