
మట్కా టైటిల్ తో వరుణ్ తేజ్ కొత్త సినిమా: ఇంట్రెస్టింగ్ గా టైటిల్ పోస్టర్
ఈ వార్తాకథనం ఏంటి
వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచ్ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో జరుగుతోంది. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు మట్కా అనే టైటిల్ ని కన్ఫామ్ చేసారు.
మట్కా పేరుతో టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా కనిపిస్తోంది.
1960ల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వచ్చినట్టుగానే, టైటిల్ పోస్టర్ లో అప్పటి కాలం నాటి రూపాయి బిళ్ళ, ఐదు రూపాయల నోటు, అంబాసిడర్ కారు కనిపిస్తున్నాయి.
పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కనిపిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ ట్వీట్
A dawn of a whole new world ❤️🔥
— Vyra Entertainments (@VyraEnts) July 27, 2023
Our Production No.2, #VT14 Titled as #MATKA 🎬
In Telugu, Tamil, Hindi, Kannada & Malayalam💥@IAmVarunTej @KKfilmmaker @Meenakshiioffl @norafatehi @gvprakash @PriyaSeth18 @mohan8998 @drteegala9 @Naveenc212 @ashishtejapuala @Rkjana11 @sunny4u007… pic.twitter.com/CgdkWvqJaw