Varun Tej : కొరియన్ కనకరాజు వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన వరుణ్ తేజ్..
ఈ వార్తాకథనం ఏంటి
వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు విజయవంతంగా 13 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.
వివరాలు
13 రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవే..
ఈ నేపథ్యంలో తాజాగా హీరో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' షూటింగ్ సమయంలో తీసిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
షూటింగ్ స్పాట్‌లో తన వర్కింగ్ స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ సినిమా 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75 కోట్ల వసూళ్లు సాధించింది.
బుధవారం నాడు కేవలం రూ.25 లక్షలు మాత్రమే రాబట్టింది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కలెక్షన్లు మరో రూ.3 లక్షలు తగ్గాయి.
దీంతో సినిమా థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వరుణ్ తేజ్ చేసిన ట్వీట్
BTS of #KOKA 😇 pic.twitter.com/fnaIGCB5jB
— Varun Tej Konidela (@IAmVarunTej) August 18, 2026