LOADING...
Vidaamuyarchi: ఓటీటీలోకి అజిత్‌ లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ పట్టుదల'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అజిత్‌ లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ పట్టుదల'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Vidaamuyarchi: ఓటీటీలోకి అజిత్‌ లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ పట్టుదల'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అజిత్ కుమార్ (Ajith Kumar) ప్రధాన పాత్రలో మాగిజ్ తిరుమనేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'విదాముయార్చి' (Vidaamuyarchi). ఈ సినిమా తెలుగులో 'పట్టుదల' (Pattudala) పేరుతో ఈ నెల 6న థియేటర్లలో విడుదలైంది. తాజాగా, ఈ చిత్రం ఓటిటి వేదికలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'నెట్‌ ఫ్లిక్స్' (Netflix) మార్చి 3న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది (Vidaamuyarchi OTT Release Date). త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వివరాలు 

 సినిమా కథ: 

అజర్‌బైజాన్‌లోని అమెరికన్ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగిగా అర్జున్(అజిత్)పని చేస్తుంటాడు. అతని భార్య కాయల్ (త్రిష).వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని 12 సంవత్సరాలుగా ఆనందంగా జీవిస్తున్నారు. అయితే,కొన్ని కారణాల వల్ల వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి.దీంతో కాయల్, అర్జున్‌ను విడిచిపోవాలని నిర్ణయించుకుంటుంది. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాయల్‌ను,"నేనే కారులో తీసుకువెళతాను, ఇది మన జీవితంలో చిరస్మరణీయమైన ఆఖరి ప్రయాణం అవుతుంది" అని అర్జున్ చెబుతాడు. కాయల్ ఇందుకు అంగీకరిస్తుంది. ప్రయాణం ప్రారంభమైన తర్వాత అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. కాయల్ అదృశ్యమవుతుంది. ఇంతకీ కాయల్ ఏమైంది? ఆమెని వెతికేందుకు బయలుదేరిన అర్జున్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?మార్గమధ్యలో పరిచయమైన రక్షిత్ (అర్జున్),దీపిక (రెజీనా)లతో అర్జున్,కాయల్‌కు ఉన్న సంబంధం ఏమిటి?అనేదే మిగతా కథ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్ ఫ్లిక్స్ చేసిన ట్వీట్