Rajamouli - Mahesh Babu : మహేష్ - రాజమౌళి మూవీ నుంచి వీడియో లీక్.. ఇకపై ట్రిపుల్ లెవల్ భద్రత!
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు - రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ కూడా అధికారికంగా బయటికి రాలేదు.
రాజమౌళి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసి, ఒక షెడ్యూల్ షూటింగ్ ముగించగా, ప్రస్తుతం ఒడిశా అడవుల్లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ కొనసాగుతోంది.
ఇప్పటివరకు ఫోటోలు, వీడియోలు లీక్ కాకున్నా, ఎప్పటికప్పుడు చిన్నచిన్న అప్డేట్స్ మాత్రం వెలుగులోకి వచ్చేవి. అయితే ఇటీవల ఒడిశా అడవుల్లో జరుగుతున్న షూటింగ్‌లో ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది.
ఈ క్లిప్‌లో మహేష్ బాబును విలన్స్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
భద్రత మరింత కట్టుదిట్టం
వెంటనే రాజమౌళి టీమ్ అప్రమత్తమై సైబర్ సెక్యూరిటీ సహాయంతో వీడియోను పోస్ట్ చేసిన ఫ్యాన్స్, నెటిజన్ల అకౌంట్స్ బ్లాక్ చేస్తోంది.
దీనిపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సినిమా నుంచి చిన్న క్లిప్ అయినా బయటకు రావడంతో అభిమానులు సంతోషపడ్డారు.
కానీ SSMB29 టీమ్ మాత్రం ఈ లీక్‌ను తీవ్రంగా తీసుకుంది. ఇప్పటివరకు షూటింగ్ ఇండోర్‌లో జరుగడంతో లీక్ సమస్యలు రాలేదు.
అవుట్‌డోర్ షూటింగ్ ప్రారంభమైన వెంటనే వీడియో బయటకు రావడంతో టీమ్ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఈ ఘటనతో రాజమౌళి టీమ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.
Details
కథనాయికగా ప్రియాంక చోప్రా
చిత్రీకరణ ప్రదేశానికి అనధికారిక వ్యక్తులు ప్రవేశించకుండా, ఫోన్లను పూర్తిగా నిషేధిస్తూ ట్రిపుల్ లెవల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఒడిశా అడవుల్లో భారీ భద్రత నడుమ షూటింగ్ జరుగుతుండగా, మహేష్ బాబు - విలన్స్ మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ లీక్ చేసిన వ్యక్తులను ఇప్పటికే గుర్తించి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సినిమా నుంచి మరే అప్డేట్ లీక్ కాకుండా రాజమౌళి టీమ్ గట్టి చర్యలు తీసుకుంటోంది.
ప్రస్తుతం ఒడిశా అడవుల్లో ఆఫ్రికాలో కనిపించే ప్రత్యేకమైన బాంబో చెట్లను సెట్స్‌గా వేయిస్తున్నారని సమాచారం.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించగా, జాన్ అబ్రహం, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.