Page Loader
ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ 
కాశ్మీర్ లో ఖుషి షెడ్యూల్

ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 25, 2023
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, ఖుషి పనుల్లో బిజీగా ఉన్నాడు. సమంత హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్ర షూటింగ్, గత కొన్ని రోజులుగా చాలా వేగంగా జరుగుతోంది. మొన్నటివరకు కేరళ అలెప్పీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా అలెప్పీ షెడ్యూల్ ముగించుకుని కాశ్మీర్ బయలుదేరుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే విజయ్ దేవరకొండ, కాశ్మీర్ ప్రాంతంలో భారీ యాక్షన్ సీన్ లో పాల్గొంటాడని, అందుకే కాశ్మీర్ వెళ్తున్నట్లు సమాచారం. కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి కాగానే, ఒక పాట కోసం టర్కీ వెళ్ళడానికి ఖుషి టీమ్ ప్లాన్ చేస్తుందని ఫిలిమ్ నగర్ సర్కిల్స్ నుండి వినిపిస్తుంది.

Details

సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీ 

షూటింగ్ పనులు చకచకా పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1వ తేదీ రోజున సినిమా విడుదలను సిద్ధం చేయాలని ఖుషి టీమ్ ప్లాన్ చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఖుషి సినిమాను, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, అందమైన ప్రేమ కథను అందించబోతుందని అంటున్నారు. ఖుషి తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది.