LOADING...
Vijay Devarakonda: నాగచైతన్య, సామ్‌ విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ 
కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ

Vijay Devarakonda: నాగచైతన్య, సామ్‌ విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 04, 2024
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమలో స‌మంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నాగ చైతన్య, స‌మంత విడాకుల విష‌యంపై సురేఖ చేసిన వ్యాఖ్యల‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే స‌మంత‌కు అనేక మంది మద్దతుగా నిలవగా, టాలీవుడ్ సీనియ‌ర్ సెలబ్రిటీలలో చిరంజీవి, నాని, వెంకటేశ్, మంచు లక్ష్మి, సుధీర్ బాబు, శ్రీకాంత్ ఓదెల సహా పలువురు దీనిపై స్పందించారు. తాజాగా, నటుడు విజయ్ దేవరకొండ కూడా ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించాడు.

వివరాలు 

విజ‌య్ దేవ‌రకొండ అసంతృప్తి

ప్ర‌స్తుత రాజకీయాలు, రాజకీయ నాయకుల ప్రవర్తనపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల ప్రవర్తనపై మాట్లాడటం చాలా కష్టంగా ఉంది. నేను ఒకటే విషయాన్ని గుర్తుచేయాలనుకుంటున్నాను, మేము మీకు ఓటేసేది మాకు మెరుగైన వసతులు కల్పిస్తారని, పెట్టుబడులు తీసుకొస్తారని, ఉద్యోగాలు కల్పిస్తారని ఆశించి. ప్రజలు ఇలాంటి వ్యవహారాలను ఇక సహించరు. రాజకీయాలు ఇంతకంటే దిగజారవద్దు, చాలు!" అంటూ విజయ్ దేవరకొండ తీవ్రంగా వ్యాఖ్యానించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజ‌య్ దేవ‌రకొండ ట్వీట్