ఖుషి ట్రైలర్ వచ్చేస్తోంది: నిడివి కూడా చెప్పేసిన రౌడీ స్టార్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా నుండి ట్రైలర్ పై అప్డేట్ వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు అటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు విజయ్ దేవరకొండ తన సోషల్ అకౌంట్ లో వెల్లడి చేసారు. 2నిమిషాల 41సెకన్ల నిడివి గల ట్రైలర్ విడుదల కానుందని, అందరూ రెడీగా ఉండాలని విజయ్ దేవరకొండ అన్నారు. ఖుషి సినిమా నుండి ఇదివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య, ఖుషి పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
సెప్టెంబర్ 1న విడుదలవుతున్న సినిమా
మలయాళ సంగీత దర్శకుడు హేషబ్ అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల అవుతుంది. ఖుషి సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలైన మూడు పాటలు అంచనాలను మరింత పెంచాయి. అటు సమంతకు, ఇటు విజయ్ దేవరకొండకు ఖుషి సినిమా విజయవంతం కావడం చాలా ముఖ్యం. శాకుంతలం సినిమాతో భారీ డిజాస్టర్ ను సమంత తన ఖాతాలో వేసుకుంది. అలాగే లైగర్ తో అతిపెద్ద ఫ్లాప్ అందుకున్నాడు విజయ్. మరి ఖుషి సినిమాతో ఇద్దరికి ఖుషీ వస్తుందేమో చూడాలి.