Page Loader
కీడాకోలాలో మెరిసిన ఫ్యామిలీ స్టార్.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా

కీడాకోలాలో మెరిసిన ఫ్యామిలీ స్టార్.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 30, 2023
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబోలో మరో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తరుణ్ ఓ స్క్రిప్ట్‌తో తనను సంప్రదించాడని విజయ్ వెల్లడించారు. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశామన్నారు. త్వరలోనే మీరు విజయ్, తరుణ్ లను కలిసి చూస్తారన్నారు. ఇప్పటికే పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలను తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, తాజాగా కీడాకోలాతో మరోసారి అలరించనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3, 2023న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే సమయంలో కీడాకోలా ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. త‌న‌ను పెళ్లి చూపులు సినిమాతో త‌రుణ్ భాస్క‌ర్ ప‌రిచ‌యం చేశాడ‌ని కీడాకోలా ఈవెంట్‌లో విజ‌య్ చెప్పాడు.

details

ప్రతీ ఫ్యామిలీలోనూ ఓ ఫ్యామిలీ స్టార్ ఉంటారు : విజయ్ దేవరకొండ

నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా,తరుణ్ భాస్కర్ లు తన సినీ ప్రయాణంలో ఎలా కలిశారో విజయ్ రివీల్ చేశారు. వీరి ప‌రిచ‌యంతో త‌న జీవితమే మారిపోయింద‌ని చెప్పుకొచ్చాడు. ఎక్క‌డెక్క‌డ్నుంచో వ‌చ్చిన త‌మ‌ను సినిమా క‌లిపింద‌న్నాడు. ఇండ‌స్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ఒక‌రికొక‌రం సహకారం అందించుకుని ఒక్కో సినిమాతో ఇంతదాకా వచ్చామన్నాడు. పాకెట్‌లో రూపాయి లేక‌పోయినా ప్ర‌పంచం మాదేనన్న ఆత్మవిశ్వాసంతో తిరిగేవాళ్ల‌మ‌ని, ఆ ఆలోచన విధానమే తమ ఎదుగుదలకు ఉప‌యోగ‌ప‌డింద‌న్నాడు. ఇదే వేడుక‌లో ఫ్యామిలీ స్టార్ కథను లీక్ చేసిన విజయ, ప్ర‌తి ఫ్యామిలీలో ఓ ఫ్యామిలీ స్టార్ ఉంటాడని, వాళ్లు లైఫ్ స్టైయిల్ ను మార్చేస్తారన్నాడు. నా వల్ల మా ఫ్యామిలీ లైఫ్ మారిందని, త‌రుణ్ ఎదుగుదలతో వాళ్ల ఫ్యామిలీ లైఫ్ మారిపోయింద‌న్నాడు.