LOADING...
Vijay Deverakonda: 'రౌడీ జనార్దన్‌' నుంచి కొత్త పోస్టర్‌తో అభిమానులకు ట్రీట్
'రౌడీ జనార్దన్‌' నుంచి కొత్త పోస్టర్‌తో అభిమానులకు ట్రీట్

Vijay Deverakonda: 'రౌడీ జనార్దన్‌' నుంచి కొత్త పోస్టర్‌తో అభిమానులకు ట్రీట్

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రోజు విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఆయనను గంభీరమైన లుక్‌లో చూపించిన టీమ్‌, ఈసారి మాత్రం ఆకట్టుకునే ప్రేమభరిత పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. "ప్రపంచంతో యుద్ధం చేస్తాడు.. కానీ ప్రేమ ముందు ఓడిపోతాడు" అంటూ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో ఆయనకు జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

వివరాలు

1980నాటి కథ..

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఆయన ఈ సినిమాలో విజయ్‌ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్‌ దేవరకొండ ఎన్నో విభిన్నమైన పాత్రల్లో కనిపించినప్పటికీ, పూర్తిస్థాయి మాస్‌ పాత్రను ఇప్పటివరకు చేయలేదని తెలిపారు. ఈ సినిమాలో తొలిసారిగా ఆయనను తూర్పు గోదావరి ప్రాంతీయ భాషలో మాట్లాడించనున్నామని చెప్పారు. కథ విన్న క్షణం నుంచే అది ఎంతో కొత్తగా, ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొన్నారు. అలాగే 1980ల కాలం నాటి వాతావరణాన్ని సాంకేతిక నిపుణులు అద్భుతంగా తెరపై మళ్లీ సృష్టించారని ఆయన ప్రశంసించారు.

Advertisement