Vijay's Jana Nayagan: దళపతి విజయ్‌కు భారీ షాక్.. రిలీజ్‌కు ముందే 'జన నాయకన్' లీక్!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు టీవీకే పార్టీ నాయకుడు, కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ వరుస షాకులను ఎదుర్కొంటున్నారు. తన సినీ ప్రయాణానికి ముగింపు పలికి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు ఆయన చేస్తున్న చివరి సినిమా 'జన నాయకన్'. ఈ చిత్రం ఇప్పటికే పలు వివాదాలు, న్యాయపరమైన సమస్యలు, సెన్సార్ చిక్కులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మొదట సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడింది. అయితే ఇంకా థియేటర్లలోకి రాకముందే, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకముందే హెచ్‌డీ క్వాలిటీలో సినిమా భాగాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందంతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది.
వివరాలు
లీక్ అయిన వీడియో వివరాలివే..
ఇంటర్నెట్‌లో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం సుమారు 48 నిమిషాల నిడివి గల హెచ్‌డీ వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ ప్రవేశ సన్నివేశం, ఒక పాటతో పాటు మమితా బైజు, దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి ప్రముఖులు కనిపించే ముఖ్య దృశ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. సినిమా ఇంకా ల్యాబ్ దశలోనే ఉండగా, అధిక నాణ్యతతో లీక్ కావడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ లీక్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉండొచ్చని విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.
వివరాలు
'తమిళ్ రాకర్స్' నుంచి ఆసక్తికర ప్రకటన
విజయ్, ఆయన పార్టీకి మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఎవరో కావాలనే ఈ చర్యకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై నిర్మాతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సాధారణంగా కొత్త సినిమాలు విడుదలైన వెంటనే పైరసీకి పాల్పడే 'తమిళ్ రాకర్స్' వెబ్‌సైట్ ఈ సందర్భంలో విభిన్నంగా స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సార్ పూర్తి కాని సినిమాలను తాము అప్‌లోడ్ చేయమని, అందువల్ల ఈ చిత్రాన్ని విడుదల చేయలేదని ఆ వెబ్‌సైట్ పేరుతో కొన్ని స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సినిమా విడుదలకు ముందే లీక్ కావడం నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగించే అంశంగా మారింది.
వివరాలు
సినిమాపై భారీ అంచనాలు..
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్:
First 5 minutes of #Jananayagan leaked .
— Honey Bunny (@poondunorukal) April 9, 2026
Anyone who is resharing will be booked and arrested .
Do not share .
Strength to the team !!
Sick behaviour pic.twitter.com/rWkesXN9k4