Na Sami Ranga-Nagarjuna-Vijay Binni: 'నా సామిరంగ' ఫేం విజయ్ బిన్నీతో నాగ్ మరోసినిమా!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuan)నా సామి రంగ(Na Sami Ranga)దర్శకుడు విజయ బిన్నీ(Vijay Binny) తో మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్ అయినా విజయ బిన్నీకి నాగార్జున 'నా సామి రంగ' చిత్రం కు డైరెక్షన్ ఆఫర్ ఇచ్చారు .
రాంగోపాల్ వర్మ(RamGopal Varma),కళ్యాణ్ కృష్ణ(Kalyan Krihshna)ప్రవీణ్ సత్తారు(Praveen satharu),రాఘవ లారెన్స్ (RaghaVa Laurence) వంటి కొత్త కొత్త దర్శకులకు కసం ఇచ్చిన నాగార్జున అవసరమైతే కుర్ర డైరెక్టర్లను రిపీట్ చేసేందుకు కూడా వెనకాడటం లేదు.
అందుకు ఉదాహరణ రాంగోపాల్ వర్మకు శివ తర్వాత అంతం,ఆఫీసర్ వంటి సినిమాలకు అవకాశం కల్పించాడు.
అదేవిధంగా రాఘవ లారెన్స్ కు మాస్ సినిమా తర్వాత డాన్ కు అవకాశమిచ్చాడు.
Vijay Binny-Nagarjuna
స్క్రిప్ట్ పనులు పూర్తవగానే సెట్స్ పైకి...
ఇప్పుడు విజయ్ బిన్నికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తికాగానే ప్రీ ప్రొడక్షన్ ప్రారంభిస్తారని సమాచారం.
ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్.
విజయ్ బిన్ని నాగార్జున కాంబినేషన్లో రూపొందే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రి ప్రొడక్షన్ ప్రారంభించి వీలైనంత త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
నాగార్జున ధనుష్ నటిస్తున్న కుబేర సినిమాలో ఒకేలాగ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాతో పాటు రజనీకాంత్(RajiniKanth)తో లోకేష్ కనకరాజు(Lokesh KanakaRaj) రూపొందిస్తున్న హుకుం(Hukum)సినిమాలో కూడా నాగార్జున ఓ కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.