LOADING...
Akhanda 2: బాలయ్యకు ధీటుగా విలనిజం.. టీజర్‌లో ఆది పినిశెట్టి మెరుపు ఎంట్రీ!
బాలయ్యకు ధీటుగా విలనిజం.. టీజర్‌లో ఆది పినిశెట్టి మెరుపు ఎంట్రీ!

Akhanda 2: బాలయ్యకు ధీటుగా విలనిజం.. టీజర్‌లో ఆది పినిశెట్టి మెరుపు ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ మాస్ మంత్ర బాలకృష్ణ ఒక పవర్‌హౌస్ అనే మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ నుంచి స్క్రీన్ ప్రెజెన్స్ దాకా ఆయన ఎంట్రీ దేనైనా హైలైట్‌ చేస్తుంది. కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా వంటి పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పే బాలయ్య సెన్సేషన్ మధ్య, ఒక్క లుక్‌తో తన ఉనికిని గుర్తింపునిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించాడు ఆది పినిశెట్టి. 'అఖండ 2 తాండవం' టీజర్ రిలీజ్ అయ్యింది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ లాంగ్ హెయిర్ లుక్, ఆయన వాడే డైలాగులు, తిరుగుతున్న త్రిశూలం లాంటి విజువల్స్ గూస్ బంప్స్ మోమెంట్స్‌ను తలపించేలా ఉన్నాయి.

Details

టీజర్ ను పవర్ ఫుల్  కట్ చేసిన బోయపాటి శ్రీను

టెర్రరిస్టులను త్రిశూలంతో సంహరించే సీన్లు బాలయ్య మాస్‌ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేశాయి. ఈ టీజర్‌ను డైరెక్టర్ బోయపాటి శ్రీను అత్యంత పవర్‌ఫుల్‌గా కట్ చేశారు. బాలయ్య ప్రతీ ఫ్రేమ్‌లో స్క్రీన్‌ను డామినేట్ చేస్తుంటే, ఆది పినిశెట్టి ఒక్క చూపుతోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ సృష్టించాడు. ఇప్పటికే ఆయన్ని 'అఖండ 2'లో విలన్‌గా ప్రకటించగా, టీజర్ ద్వారా దానికి గట్టి బలమొచ్చింది. బోయపాటి శ్రీను గతంలో 'సరైనోడు' సినిమాలో ఆదిని విలన్‌గా పరిచయం చేసి మంచి పేరు తెచ్చిపెట్టాడు. ఇప్పుడు మరోసారి అతనికి దుష్ట అఘోర క్యారెక్టర్ ఇవ్వడం చూస్తుంటే, 'అఖండ 2'లో విలనిజం గట్టిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Details

అఘోర పాత్రలో ఆది పినిశెట్టి

'అఖండ' ఫస్ట్ పార్ట్‌లో పరమశివుడి ఆవాహనతో వచ్చిన అఘోర(బాలయ్య)కు ప్రతిస్పర్థిగా ఉన్న దుష్ట అఘోర పాత్ర (ఆది) కథకు కీలకం కానుంది. ఆది పినిశెట్టి నిజానికి టాలెంటెడ్ యాక్టర్. తమిళం నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో 'మృగం' సినిమాతోనే నటుడిగా తనదైన ముద్ర వేశాడు. తెలుగులో 'నిన్ను కోరి', 'అజ్ఞాతవాసి', 'రంగస్థలం', 'ది వారియర్' వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు చేశాడు. కానీ అతనికి బిగ్ బ్రేక్ మాత్రం అందలేకపోయింది. ఇప్పుడు 'అఖండ 2' ఆ ఖాళీని పూరించబోతున్నట్టే కనిపిస్తోంది.

Details

ఆఖండ 2పై భారీ అంచనాలు

విలన్‌గా ఓ వైపు ఛాన్స్‌లు అందుకుంటూనే హీరోగా కూడా కెరీర్‌ను ముందుకు నడుపుతున్న ఆదికి ఈ మూవీ కీలకం కానుంది. 'అఖండ 2' ట్రైలర్ విడుదలైతే అతని క్యారెక్టర్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఫుల్ లెంగ్త్ మూవీలో బాలయ్య - ఆదిల మధ్య ఎదురెదురు తాండవం ఎలా ఉండబోతుందో సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.