LOADING...
Vijay: విజయ్,త్రిష వివాదం.. సముద్రఖని వ్యాఖ్యలు వైరల్
విజయ్,త్రిష వివాదం.. సముద్రఖని వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్,త్రిష వివాదం.. సముద్రఖని వ్యాఖ్యలు వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ సున్నిత అంశం తాజాగా వివాదానికి దారితీసింది. ఈ విషయంపై నటుడు, దర్శకుడు సముద్రఖని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ఇటీవల జరిగిన ఒక పెళ్లి వేడుకలో విజయ్, త్రిష కలిసి కనిపించిన తీరు గురించి సముద్రఖని అసంతృప్తి వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.

వివరాలు 

రాజకీయ, సినీ వర్గాల్లో చర్చలు

ఆ వీడియోలో సముద్రఖని మాట్లాడుతూ, "ఇది ఆటలా భావించాలా? వ్యక్తిగత విషయాలను ఇలా బయట పెట్టడం అవసరమా? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు? అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు ఎందుకు? దీని వల్ల పార్టీకి మద్దతు ఇస్తున్న వారు కూడా దూరమవుతున్నారు" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చలు మరింత ముదిరాయి. అయితే ఈ వివాదంపై తర్వాత స్పందించిన సముద్రఖని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.

వివరాలు 

నిజాయతీతోనే చెప్పాను: సముద్రఖని

ఎవరో కావాలనే తన మాటలను మధ్యలో రికార్డ్ చేసి, వక్రీకరించి ప్రచారం చేశారని ఆరోపించారు. తాను చెప్పింది నిజాయతీతోనేనని తెలిపారు. విజయ్ రాజకీయ ప్రస్థానానికి మొదటి నుంచే తాను మద్దతు ఇస్తున్నానని, అందుకే ఆయనకు సంబంధించిన ఏ విషయంలోనైనా తేడా కనిపిస్తే తనకు బాధ కలుగుతుందని భావోద్వేగంగా చెప్పారు. తన అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, చిన్న విషయాన్ని అవసరంలేకుండా పెద్దదిగా మార్చారని సముద్రఖని వెల్లడించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అవును, నా బాధలో నుంచి వచ్చిన మాటలు అవి: సముద్రఖని

Advertisement