తదుపరి వార్తా కథనం

Vishal : ప్రేయసితో హీరో విశాల్.. కెమరా చూడగానే పరుగు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 26, 2023
05:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ హీరో విశాల్(Vishal) గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కోలీవుడ్‌లో ఒకప్పుడు విశాల్ ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్‌గా ఉండేవి.
గతంలో హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో విశాల్ ఎంగేజ్ మెంట్ జరగ్గా, అది కొన్ని అనివార్య కారణాల క్యాన్సల్ అయ్యింది.
ఇప్పటికీ విశాల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్నారు.
తాజాగా న్యూయార్క్ వీధిలో ఓ అమ్మాయితో విశాల్ భుజం మీద చేయి వేసుకొని కనిపించాడు.
కొందరు అతన్ని గుర్తుపట్టి విశాల్ అని పిలవగానే, అమ్మాయితో కలిసి విశాల్ పారిపోయాడు.
కెమెరాలు కనిపించగానే ముఖం కనపడకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కెమరాను చూడగానే పారిపోయిన హీరో విశాల్
Is that Actor @VishalKOfficial walking with someone in NYC 🤔 pic.twitter.com/ddMESEuKOq
— Ramesh Bala (@rameshlaus) December 26, 2023