Laila Movie First Look: లేడి గెటప్పులో కనిపించనున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
"గామి", "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత, "మెకానిక్ రాకీ" సినిమాతో మళ్లీ సక్సెస్ సాధించారు.
థియేట్రికల్ రన్ పూర్తి చేసిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది.
"మెకానిక్ రాకీ" తర్వాత విశ్వక్ సేన్ వెంటనే మరో కొత్త ప్రాజెక్టు ప్రారంభించారు
. "లైలా" అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన తన వెర్సటాలిటీని మరోసారి చూపించబోతున్నారు.
ఇందులో అబ్బాయి,అమ్మాయి పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నాడు.
వివరాలు
"లైలా" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల
"లైలా" సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
తాజాగా, క్రిస్మస్ సందర్భంగా "లైలా" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో విశ్వక్ సేన్ స్టైలిష్, రిచ్ అవతార్‌లో కనిపించి, మోడరన్ అవుట్‌ఫిట్‌లో, షేడ్స్, గోల్డ్ యాక్ససరీస్ ధరించి కూల్, కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఈ పాత్రను "సోను మోడల్"గా ప్రదర్శించారు.
వివరాలు
ఇంపాక్ట్ కలిగించిన పోస్టర్
ఫస్ట్ లుక్‌లో విశ్వక్ సేన్ మెడపై పచ్చబొట్టు, చేతులపై "సోను లవర్", "సోను కిల్లర్" అనే టాటూలతో కనిపించారు.
అతని బోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాత్రకు మల్టీ-డైమెన్షనల్ నేచర్‌ను సూచిస్తున్నాయి.
పోస్టర్ చాలా ఇంపాక్ట్ కలిగించింది. ఇందులో విశ్వక్ సేన్ బ్యూటిఫుల్ మేకోవర్‌తో అమ్మాయి పాత్రను పోషించనున్నట్లు కనిపిస్తుంది.
ఈ చిత్రం రీమేక్ లేదా కాపీ సంబంధిత టాక్‌లు కూడా ఉన్నాయి. "లైలా" సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన "డ్రీమ్ గర్ల్" మూవీకి కాపీ లేదా రీమేక్ అని పలువురు అనుకుంటున్నారు.
"డ్రీమ్ గర్ల్"లో ఆయుష్మాన్ ఖురానా అబ్బాయిలకు కాల్స్ చేయడం, డేటింగ్ యాప్‌లో అమ్మాయి పాత్రను పోషించడం కనిపించిన సంగతి తెలిసిందే.
వివరాలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల
ఇప్పుడు అదే తరహాలో విశ్వక్ సేన్ "లైలా" సినిమాలో చేయబోతున్నారేమో అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
"లైలా" మూవీలో విశ్వక్ సేన్‌కు జోడీగా ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. "లైలా" చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లైలాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్
SONU MODEL ko hii boldo 😎
— VishwakSen (@VishwakSenActor) December 25, 2024
Lover aina, Killer ainaa Echipaad untaduu 🥁#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th ❤🔥#EchipaadSecunderabad @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/UX3Aazj40A