VishwakSen : సైలెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన మెకానిక్ రాకీ.. ఎక్కడంటే..?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన "మెకానిక్ రాకీ" చిత్రాన్ని నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించారు. ఈ సాలిడ్ ఎంటర్టైనర్ గత నెల 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ముందురోజు ప్రీమియర్ షోస్‌తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి టాక్ పొందినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద నిరాశజనక ఫలితాలు కనబర్చింది. ముఖ్యంగా, సెకండ్ హాఫ్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ బలహీనంగా ఉండడంతో ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.
బయ్యర్లకు కూడా నష్టాలు
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బయ్యర్లకు కూడా నష్టాలు మిగిల్చింది. విడుదలైన మొదటి వారంలోనే థియేటర్ల నుంచి తప్పుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్, ఈ సినిమా హక్కులను విడుదలకు ముందే కొనుగోలు చేసి, ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించింది. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం,ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి నిర్మాణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. వీకెండ్ రావడంతో, థియేటర్లలో ఇతర ముఖ్యమైన సినిమాలు లేకపోవడంతో "మెకానిక్ రాకీ"ను చూసి ఆరంభించడం ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.