Page Loader
Vishwambhara : విశ్వంభర ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌కి కౌంట్‌డౌన్ మొదలు!
విశ్వంభర ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌కి కౌంట్‌డౌన్ మొదలు!

Vishwambhara : విశ్వంభర ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌కి కౌంట్‌డౌన్ మొదలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ నుంచి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్టుల్లో 'విశ్వంభర' (Vishwambhara) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దసరా సందర్భంగా విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌ 12న ఫస్ట్‌ సింగిల్‌ 'రామ రామ' (Raama Raama) విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.

Details

నూతన పోస్టర్ విడుదల

ఈ అప్డేట్‌తో పాటు బాల హనుమాన్‌ల మధ్య చిరంజీవి ఉన్న ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు సినిమా విడుదల తేదీని కూడా త్వరలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఒక సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతోంది. 'బింబిసార' సినిమాతో గుర్తింపు పొందిన వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్‌ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏప్రిల్ 12న రామ రామ సాంగ్ రిలీజ్