
Vishwambhara: విశ్వంభర మొదటి సాంగ్ రిలీజ్.. ఎప్పుడు ఎక్కడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర'.
'బింబిసార' సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
ఇది ఒక సోషియో ఫాంటసీ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది.ఇందులో చిరంజీవికి జోడీగా కోలీవుడ్ అందాల తార త్రిష కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.
అయితే, తర్వాత విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మాత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నప్పటికీ, తాజాగా విడుదలైన పోస్టర్లలో చిరు లుక్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
వివరాలు
హనుమాన్ జయంతి సందర్భంగా పాట విడుదల
ఈ ఉత్సాహాన్ని ఇంకా పెంచేలా చిత్ర బృందం తాజాగా మరో శుభవార్తను వెల్లడించింది.
విశ్వంభరలోని మొదటి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ పాటను ఏప్రిల్ 12న, హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఇందుకోసం కృష్ణా జిల్లాలోని నందిగామ పరిటాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న భారీ చిత్రం కావడంతో, మెగా అభిమానులు విశ్వంభరపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరహాలో మరో విజువల్ వండర్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
వివరాలు
విడుదల తేదీ అధికారికంగా ఖరారు కాలేదు
ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్నందున గ్రాఫిక్స్ వర్క్ చాలా కీలకం కానుంది.
క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చిత్రబృందం శ్రద్ధ వహిస్తోంది. ఇదే కారణంగా, ఈ చిత్రానికి విడుదల తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.