Page Loader
Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది!
సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది!

Dilraju : సినిమాల్లోకి రావాలా? దిల్ రాజు డ్రీమ్స్ మీ కోసం వేచిచూస్తోంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరు వినిపిస్తే టాలెంట్‌కు కొత్త ఊపిరి లభించినట్టు. నిర్మాతగా మాత్రమే కాకుండా, టాలెంట్‌ను గుర్తించే దృక్పథం కలిగిన వ్యక్తిగా భారతీయ సినీ పరిశ్రమలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన మొదటి హిట్ చిత్రం 'దిల్' పేరును ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన, ఇప్పటివరకు ఎన్నో యంగ్ టాలెంట్స్‌ను పరిచయం చేశారు. ఇప్పుడు అదే దారిలో మరో అడుగు వేస్తూ, కొత్త టాలెంట్‌కు మరింత బలమైన వేదికను అందించేందుకు ముందుకొచ్చారు.

Details

'దిల్ రాజు డ్రీమ్స్' - యువ ప్రతిభకు ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 

తెలుగు సినీ రంగానికి తాజా టాలెంట్‌ను పరిచయం చేయాలనే లక్ష్యంతో దిల్ రాజు రూపొందించిన కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ పేరు 'దిల్ రాజు డ్రీమ్స్'. తన సినీ ప్రయాణంలో ఎప్పుడూ ఫ్రెష్ కంటెంట్‌ను ప్రోత్సహించిన ఆయన, ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యువతకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు. జూన్ నెల నుంచి ఈ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానుంది.

Details

 ఎలా జాయిన్ అవ్వాలి?

ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు [https://dilrajudreams.com](https://dilrajudreams.com/) అనే లింక్‌ ద్వారా తమ పూర్తి వివరాలను నమోదు చేయాలి. అనంతరం దిల్ రాజు డ్రీమ్స్ బృందం వారిని స్వయంగా సంప్రదిస్తుంది. ఇది ఎవరికోసం? తమ టాలెంట్ ఉన్నా సరైన వేదిక లేక మిగిలిపోయిన ఎన్నోమంది యువతకు ఇది గోల్డెన్ ఛాన్స్. టాలెంట్ ఉన్నా పరిశ్రమలో ఎంట్రీ ఎలా ఇవ్వాలో తెలియక, సంబంధాలు లేక అర్థాంతరంగా ఆగిపోతున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది. కథా రచయితలు, దర్శకులుగా ఆశయాలున్నవారు, నటనలో నైపుణ్యం ఉన్నవారు, సాంకేతికంగా మెరుగైన ప్రతిభ కలిగినవారు తమ కలలను సాకారం చేసుకోవచ్చు.

Details

కలలకు దారి ఇది

"దిల్ రాజు డ్రీమ్స్" ప్లాట్‌ఫామ్ అంటే కేవలం వెబ్‌సైట్ మాత్రమే కాదు, ఇది కలల్ని నిజం చేసే దారి. కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరూ తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. మరి ఇంకెందుకు ఆలస్యం? మీలో టాలెంట్ ఉందని నమ్మకం ఉంటే, వెంటనే రిజిస్టర్ అవ్వండి.. మీ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇది మొదటి అడుగు కావచ్చు!