
Rajinikanth: రిటైర్‌మెంట్ తర్వాత 'వేల్పారి' పుస్తకం పూర్తి చేస్తా : రజనీకాంత్
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్. వెంకటేశన్ రచించిన ప్రసిద్ధ చారిత్రక నవల 'వేల్పారి'కి విశేష పాఠకాదరణ లభించిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చెన్నైలో ప్రత్యేక సాహితీ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై తనదైన శైలిలో ప్రసంగించారు. రజనీ తన ప్రసంగంలో కొన్ని సరదా వ్యాఖ్యలు చేస్తూ, ''ఇలాంటి కార్యక్రమాలకు కమల్‌హాసన్, శివకుమార్ లాంటి మేధావుల్ని పిలవాలి. వాళ్లు ఎంతో చక్కగా మాట్లాడతారు. నాకు మాత్రం 75ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని స్లో మోషన్‌లో నడవడం తప్ప పెద్దగా శాస్త్రీయమైన మాటలు రావు అంటూ నవ్వులు పూయించారు. అంతేకాకుండా ఇటీవల ఓ కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయని, అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Details
రామకృష్ణ ఆశ్రమం వల్లే పఠన అలవాటు
ఏం మాట్లాడాలనేది విజ్ఞానం, ఎలా చెప్పాలనేది ప్రతిభ, ఎంత చెప్పాలో స్టేజ్ నిర్ణయిస్తుంది. కానీ ఏం చెప్పకూడదో అనుభవం నేర్పుతుందని ఆయన చెప్పారు. తనకు పుస్తకాలు చదవాలన్న అభిరుచి రామకృష్ణ ఆశ్రమం వల్ల వచ్చిందని రజనీ చెప్పారు. ఇప్పటివరకు ఎంతోమంది గొప్ప రచయితల రచనలను చదివానని చెప్పారు. జయకంధన్ రచనల నుంచి తీవ్రంగా ప్రభావితమయ్యానని గుర్తు చేశారు. ఓ పుస్తకం చదివి కన్నీళ్లు పెట్టుకున్నానని కూడా చెప్పారు.
Details
'వేల్పారి' పుస్తకాన్ని చదువుతున్న రజనీ
'స్నేహితుల సిఫారసుతో నేను 'వేల్పారి' పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను. ప్రస్తుతం దాని 25 శాతం చదివాను. సినిమాలకు రిటైర్‌మెంట్ తర్వాత పూర్తి చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఆధారంగా దర్శకుడు శంకర్ రూపొందించనున్న సినిమాను తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రజనీ ప్రాజెక్టులివే ప్రస్తుతం రజనీకాంత్ 'కూలీ', 'జైలర్ 2' చిత్రాల్లో నటిస్తున్నారు. శక్తిమంతమైన పాత్రల్లో కనిపించనున్న రజనీ, మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నారు. ఆయన నటించిన 'కూలీ' చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సాహిత్య వేడుక రజనీకాంత్ మేధోసౌరభాన్ని చాటిన కార్యక్రమంగా నిలిచింది. 'వేల్పారి' పుస్తకానికి మరింత ఉజ్వల ప్రచారాన్ని తెచ్చింది.