Mufasa : మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో 'ముఫాసా' కి విపరీతమైన క్రేజ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి వద్ద ఒక భారీ ప్రాజెక్టులో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా గతంలో మహేశ్ బాబు 'జల్సా', 'బాద్ షా' సినిమాలకు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సారి హాలీవుడ్ సినిమాకు ఆయన ఓ ఇంగ్లీష్ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చారు. మహేశ్ బాబు డబ్బింగ్ చేసిన తాజా సినిమా 'ముఫాసా - ది లయన్ కింగ్' కాగా ఈ చిత్రం ఈ నెల 20న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా, మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాను తమ అభిమాన హీరో వాయిస్ ఇచ్చిన సినిమాగా భావిస్తున్నారు. ఈ సినిమాతో మహేశ్ బాబు అభిమానులు ఒక ప్రత్యేక రికార్డును సృష్టించారు. సాధారణంగా, తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ప్రీమియర్ షోలు జరుగుతాయి. అయితే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వాల్ట్ డిస్నీ నుంచి వస్తున్న ముఫాసా - ది లయన్ కింగ్‌కు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ 35MM సినిమా థియేటర్ లో 20వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రీమియర్ షో ఆర్గనైజ్ చేశారు.