
Chattisgarh: సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకులమోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ సంఘటనలో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్‌గఢ్‌లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.
దీని నేపథ్యంలో దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్) బృందం తనిఖీలు చేపట్టింది.
మావోయిస్టులు తలదాచుకున్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు మొదట కాల్పులు ప్రారంభించగా, బలగాలు ప్రతిగా కాల్పులు జరిపాయి.
ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
సంఘటన స్థలంలో ఆటోమేటిక్ రైఫిల్స్‌తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
10 మంది మావోయిస్టులు మృతి
⚡️ 10 Maoists Killed in Encounter with Security Forces in India's Chhattisgarh- Reports pic.twitter.com/eCOqOdPWwG
— RT_India (@RT_India_news) November 22, 2024