తదుపరి వార్తా కథనం

Chandrababu: ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 04, 2025
05:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, అవసరాన్ని బట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో (CHCs) వర్చువల్ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదనంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 13 డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.