Page Loader
Kerala: కొచ్చిన్‌ తీరంలో లైబీరియా నౌకకి ప్రమాదం.. తీరానికి కొట్టుకొస్తున్న నీట మునిగిన కంటెయినర్లు
తీరానికి కొట్టుకొస్తున్న నీట మునిగిన కంటెయినర్లు

Kerala: కొచ్చిన్‌ తీరంలో లైబీరియా నౌకకి ప్రమాదం.. తీరానికి కొట్టుకొస్తున్న నీట మునిగిన కంటెయినర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ తీరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక ఘటనలో,మునిగిన కంటెయినర్లలో కొన్ని సోమవారం తీరానికి చేరుకున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం,దక్షిణ కొల్లం, అలప్పుజ తీర ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది కంటెయినర్లు కనిపించాయి. ఆదివారం,కొచ్చిన్ తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా దేశానికి చెందిన ఓ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిన ఘటన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 640ఇంధన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం, వీటన్నీ సముద్రంలో పడిపోయాయి. ఈ కంటెయినర్లలో సుమారు వంద వరకు ఇప్పటికీ నీటిపై తేలియాడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే,వాటిలో కొన్ని కంటెయినర్లు తెరుచుకుని ఉండటంతో,అందులోని రసాయన ద్రవాలు బయటకు లీక్ అవుతున్నాయని కోస్ట్‌ గార్డ్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తీరానికి కొట్టుకొచ్చిన లైబీరియా నౌక కంటెయినర్లు