Page Loader
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 'సమీకృత ఇంధన పాలసీ' (IEP)ని రూపొందించింది. ఇందులో సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పీఎస్‌పీ, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్లు ఒకే పాలసీలో భాగంగా ప్రోత్సహించబడతాయి. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం పాలసీ లక్ష్యంగా ఉంది. ఇందులో గ్రీన్ హైడ్రోజన్,గ్రీన్ అమ్మోనియా,ఎలక్ట్రోలైజర్ తయారీ,బయోఫ్యూయల్,బ్యాటరీ స్టోరేజ్, పీఎస్పీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఉంటాయి.

వివరాలు 

పునరుత్పాదక తయారీ జోన్‌ల ఏర్పాటు

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వనరులను విస్తరించి, విద్యుత్ సేకరణ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని సిద్ధం చేసింది. అలాగే, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, పెట్టుబడి అవకాశాలను సృష్టించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రధాన లక్ష్యాలు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వనరులను విస్తరించి, విద్యుత్ సేకరణ ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త పాలసీని సిద్ధం చేసింది. అలాగే, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, పెట్టుబడి అవకాశాలను సృష్టించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రధాన లక్ష్యాలు. ప్రభుత్వం పునరుత్పాదక తయారీ జోన్‌లు (REEMZ)ని ఏర్పాటు చేసి, ఆర్‌ఈ టెక్నాలజీలకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది. సౌర, విండ్‌, హైడ్రోజన్ ప్రాజెక్టులకు రాయితీలు, భూమి లీజు సదుపాయాలు, ఎఫ్‌సీఐలో పెట్టుబడులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.

వివరాలు 

రాష్ట్రంలో 500 ఛార్జింగ్‌ కేంద్రాలు 

గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లలో మౌలిక సదుపాయాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. పునరుత్పాదక ప్రాజెక్టుల నిర్వహణ కోసం నోడ్ ఏజెన్సీగా నెడ్‌క్యాప్‌ వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లక్ష్యంతో, రాబోయే ఐదేళ్లలో 500 ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు 25% పెట్టుబడి రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. కార్పొరేషన్లు, జిల్లాకేంద్రాల్లో 150 కేంద్రాలు, జాతీయరహదారుల వెంబడి 150 కేంద్రాలు, మిగిలిన కేంద్రాలను ప్రైవేటు భవనాల్లో ఏర్పాటుచేయాలని ప్రణాళిక వేయింది. ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన గరిష్ట సీలింగ్ టారిఫ్ (ఎంసీటీ) అమలు చేయనుంది.