Page Loader
PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు 
PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు

PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2024
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా.. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి 12 మంది ముఖ్యమంత్రులు హాజరవుతారని బీజేపీ నేత ఒకరు తెలిపారు. అంతేకాకుండా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ ఎన్డీయే మిత్రపక్షాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

Details 

ప్రధాని నామినేషన్‌కు వచ్చేవారు వీరే..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నామినేషన్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా కూడా అక్కడ ఉంటారని వారు తెలిపారు.

Details 

నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్‌కు హాజరుకానున్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు, ప్రధానమంత్రి దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగాదేవికి పూజలు చేస్తారు. అలాగే, ప్రధాని మోదీ నమో ఘాట్‌ను కూడా సందర్శిస్తారు. అక్కడి నుంచి బాబా కాలభైరవ ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు. అనంతరం ప్రధాని నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్లనున్నారు. అనంతరం కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.