LOADING...
Students Suspended: సీనియర్‌ను కొట్టిన జూనియర్‌ విద్యార్థులు.. 13 మంది సస్పెండ్ 
సీనియర్‌ను కొట్టిన జూనియర్‌ విద్యార్థులు.. 13 మంది సస్పెండ్

Students Suspended: సీనియర్‌ను కొట్టిన జూనియర్‌ విద్యార్థులు.. 13 మంది సస్పెండ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కాలేజీ హాస్టల్‌లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఒక సీనియర్‌ విద్యార్థిని జూనియర్లు కొట్టారు. అతడ్ని భౌతికంగా హింసించడంతో పాటు వివిధ విధాలుగా శిక్షించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటన మార్చి 20న నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో జరిగింది. దొంగతనం ఆరోపణలతో సదరు సీనియర్‌ విద్యార్థిపై జూనియర్లు దాడి చేశారు.

వివరాలు 

జూనియర్‌ విద్యార్థులకు సస్పెన్షన్

అతడ్ని తీవ్రంగా కొట్టడంతో పాటు అర్థనగ్నంగా మోకాళ్లపై ఉండేలా శిక్షించారని తెలుస్తోంది. దీనివల్ల బాధితుడు తీవ్రంగా క్షోభకు గురయ్యాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందింది. దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణలో 13 మంది జూనియర్‌ విద్యార్థులు ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిని కాలేజీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. పోలీసుల చర్యలు ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

13 మంది సస్పెండ్ 

Advertisement