
ఐదో రోజూ కొనసాగుతున్న అనంతనాగ్ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భారత సైన్యం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా కొకెర్‌నాగ్ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఐదు రోజు గారోల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గారోల్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలోని గుహలో దాగిన ఉగ్రవాదులను అంతం చేసేందుకు డ్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్న భారత సైన్యం, కోకెర్‌నాగ్‌లోని ఉగ్రవాదుల స్థావరం సమీపంలో సాంకేతికత ఉపయోగిస్తూ మంటలు రేపింది. కిస్తవాడ్‌లో 13 మంది ఉగ్రవాదుల ఆస్తులను సైన్యం జప్తు చేయనున్న క్రమంలో నిందితులంతా 30 రోజుల్లో హాజరుకావాలని గడువు విధించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోకెర్‌నాగ్‌లోని ఉగ్రవాదుల స్థావరం వద్ద చెలరేగిన మంటలు
Kokernag Encounter🚨 Fire erupted near the terrorist hideout spot in Kokernag #Anantnag #KokernagEncounter pic.twitter.com/kXdod5IBu2
— OSINT Updates (@OsintUpdates) September 17, 2023