Page Loader
కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 
కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు ఉన్నతాధికారులు వీరమరణం 

వ్రాసిన వారు Stalin
Sep 14, 2023
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమన్యున్ ముజామిల్ భట్ మరణించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వెళ్లారు. ఈ క్రమంలో కల్నల్, మేజర్, డిప్యూటీ ఎస్పీ ముందుండి దళాలను నడిపిస్తున్నారు. ఒక రహస్య స్థావరంలో ఉగ్రవాదులు కనిపించగా, అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో ముందు వరుసలో నిలబడ్డ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ ఎస్పీ హిమన్యున్ ముజామిల్ భట్‌పై కాల్పులు జరిపారు.

జమ్ము

'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు చెందిన ఉగ్రవాదులు

ఉగ్రవాదుల కల్నల్ అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు అధికారులకు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్‌లో శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఉగ్రవాదులు లష్కరే సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'కు చెందినవారుగా ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ (19 ఆర్ఆర్) యూనిట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆయన ప్రతిష్టాత్మక సేన మెడల్ గ్రహీత కూడా కావడం గమనార్హం. హిమాయున్ ముజామిల్ భట్ తండ్రి గులాం హసన్ భట్ జమ్ముకశ్మీర్ ఐజీ హోదాలో రిటైర్ అయ్యారు. అయన తన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ముగ్గురు యువ ధైర్యవంతులైన అధికారులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నివాళుల్పరిస్తున్న దృశ్యం