LOADING...
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు.. గ్రెనేడ్‌లు,మందుగుండు సామగ్రి స్వాధీనం
గ్రెనేడ్‌లు,మందుగుండు సామగ్రి స్వాధీనం

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని షోపియన్‌లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు.. గ్రెనేడ్‌లు,మందుగుండు సామగ్రి స్వాధీనం

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు బలగాలు అరెస్ట్ చేశారు. షోపియాన్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.అరెస్టైన ఉగ్రవాదులను ఇర్ఫాన్‌ బషీర్‌, ఉజైర్‌ సలామ్‌ గా గుర్తించారు. వీరి వద్ద నుండి రెండు AK-56 తుపాకులు, నాలుగు మ్యాగజైన్లు, 102 తూటాలు, రెండు హ్యాండ్‌ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. ఇటీవలి పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాద కార్యకలాపాలను సమూలంగా నిర్మూలించేందుకు భారత భద్రతా బలగాలు గట్టి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉగ్రవాదులు అరెస్టు అయ్యినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు