Page Loader
దిల్లీలో తప్పిన ఘోరం.. ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్
ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్

దిల్లీలో తప్పిన ఘోరం.. ఒకేసారి 2 విమానాలకు ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 23, 2023
06:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ విమానాశ్రయంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. 2 విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌ కోసం ఏటీసీ గ్రీన్ సిగ్నల్ అందింది. తప్పిదాన్ని గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), చివరి క్షణంలో టేకాఫ్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. దిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాకు వెళ్తున్న విమానం టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైంది. అహ్మదాబాద్ నుంచి దిల్లీకి వ‌స్తోన్న మరో విమానం రన్‌పై ల్యాండ్ అయ్యేందుకు సన్నద్ధమైంది. ఒకేసారి రెండింటికి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడంతో ర‌న్‌వేపై రెండు విమానాలు ఎదురెదురుగా ఢీకొనే దుస్థితి తలెత్తింది.

DETAILS

అప్రమత్తమైన లేడీ పైలెట్, ఏటీసీకి సమాచారం

దీంతో తప్పును గుర్తించిన ఏటీసీ అధికారులు టేకాఫ్‌ నిలిపేయాలని దిల్లీ - బాగ్‌డోగ్రా విమానం పైలట్‌కు ఆదేశాలు జారీ చేశారు. సదరు విమానం వెనక్కి రావడంతో భారీ ప్రమాదాన్ని నిలువరించగలిగారు. అహ్మదాబాద్ నుంచి దిల్లీకి వ‌స్తున్న విమానంలోని మ‌హిళా పైలెట్, సోనుగిల్శ్(45) బాగ్‌డోగ్రా విమానం టేకాఫ్ పై ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో సదరు టేకాఫ్ వెంటనే నిలిపేయాలని ఏటీసీ ఆదేశించింది. రెండు విమానాల మధ్య కేవలం 1.8 కిమీ దూరం మాత్రేమే ఉండం గమనార్హం. అప్రమత్తతో సుమారు 300మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ రెండు విమానాలు కూడా విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందినవే కావడం గమనార్హం. ఘటనకు ఏటీసీని బాధ్యులుగా చేస్తూ డీజీసీఏ వేటు వేసింది.

EMBED

ఘటనకు ఏటీసీని బాధ్యులుగా చేస్తూ డీజీసీఏ వేటు

DGCA de-rosters Air Traffic Controller over "runway incursion" incident at Delhi airport Read @ANI Story | https://t.co/5zFsM4CwqP#DGCA #Vistara #AirTraffic pic.twitter.com/S3TS4Or794— ANI Digital (@ani_digital) August 23, 2023