
Kolkata: కోల్‌కతాలో విస్తుగొలిపే ఘటన.. సూట్‌కేసులో శరీర భాగాలు నదిలో విసిరేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలు..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో (Kolkata) సంచలనకర ఘటన చోటుచేసుకుంది. అహిరిటోలా ప్రాంతంలో ఇద్దరు మహిళలు సూట్‌కేసులో మనిషి శరీర భాగాలను (Human Body Parts) తీసుకువచ్చి, హుగ్లీ నదిలో విసరాలని ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం, ఇద్దరు మహిళలు టాక్సీలో అహిరిటోలా ఘాట్ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద పెద్ద సూట్‌కేస్ ఉండటం, కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో కొంతమంది స్థానికులు వారిని నిలువరించి ప్రశ్నించారు. సూట్‌కేసులో శునకం అవశేషాలు ఉన్నాయని వారు సమాధానం ఇచ్చారు. అయితే, స్థానికులకు అనుమానం వచ్చి దానిని తెరిచి చూడగా, అందులో మనిషి శరీర అవయవాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
వివరాలు
అదుపులోకి ఇద్దరు మహిళలు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. శరీర అవయవాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎవరినైనా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో తుది నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం అవసరమని తెలిపారు.