LOADING...
Nagarjuna Sagar:నాగార్జున సాగ‌ర్‌కు పోటెత్తిన వ‌ర‌ద.. 24 గేట్లు ఎత్తివేత‌
నాగార్జున సాగ‌ర్‌కు పోటెత్తిన వ‌ర‌ద.. 24 గేట్లు ఎత్తివేత‌

Nagarjuna Sagar:నాగార్జున సాగ‌ర్‌కు పోటెత్తిన వ‌ర‌ద.. 24 గేట్లు ఎత్తివేత‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండల మాదిరిగా ఉప్పొంగుతున్నాయి. ఈ పరిస్థితిలో అధికారులు శ్రీశైలం గేట్లను ఎత్తి, దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ఫలితంగా నాగార్జునసాగర్ డ్యాం నీటి మట్టం ఓవర్‌ఫ్లో అయ్యే స్థాయికి చేరుకోవడంతో, ఇవాళ ఉదయం అధికారులు మొత్తం 24 గేట్లను ఎత్తి దిగువకు నీటి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ వద్ద ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం అది 589.30 అడుగుల వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

నాగార్జునసాగర్‌కి  పర్యాటకులు 

పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ 309.95 టీఎంసీలకు చేరింది. 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో, పరిసర జిల్లాలు, మండలాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున నాగార్జునసాగర్‌కి తరలివస్తున్నారు. డ్యాం పరిసరాల్లో సెల్ఫీలు దిగుతూ, స్నేహితులతో సరదాగా గడుపుతూ పర్యాటకులు ముచ్చటగా ఎంజాయ్ చేస్తున్నారు.