2024 నాటికి చెన్నైలో 7శాతం భూమి మునిగిపోతుంది.. నివేదికిచ్చిన సీఎస్‌టీఈపీ
తమిళనాడు రాజధాని చెన్నై సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సిఎస్‌టిఇపి) గురువారం ఓ నివేదకను విడుదల చేసింది. 2040 నాటికి సముద్ర మట్టం పెరగడం వల్ల చెన్నైలో దాదాపు 7 శాతం భూమి మునిగిపోతుందని అంచనా వేసింది. చెన్నైలోని అడయార్ ఎకో-పార్క్, ఐలాండ్ గ్రౌండ్, స్టేట్ సింబల్ మెమోరియల్, పల్లికరణై వెట్‌ల్యాండ్, ఓడరేవు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.
లోతట్టు తీరప్రాంతాల్లో ఎక్కువ కానున్న ప్రమాదాలు
అదేవిధంగా 2060 నాటికి 9.65 శాతం (114.31 చదరపు కి.మీ.), 2080 నాటికి 15.11 శాతం (159.28 చదరపు కి.మీ.) 2100 నాటికి 16.9 శాతం (207.04 చదరపు కి.మీ.) మునిగిపోయే ఉండే అవకాశం ఉంది. చెన్నై సముద్ర మట్టం 1987 నుండి 2021 వరకు 0.679 సెం.మీ పెరుగుదలను చూసింది, వార్షిక పెరుగుదల 0.066 సెం.మీ. దాకా ఉంది. లోతట్టు తీరప్రాంత నగరాలు, ఇప్పుడు పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల మరింత ప్రమాదం కలిగే అవకాశం ఉంది.